లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా: సాయిపల్లవి సీరియస్ వార్నింగ్, అసలేం జరిగింది?

First Published | Dec 12, 2024, 9:57 AM IST

నటి సాయి పల్లవి తనపై వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రామాయణం' సినిమా కోసం తన అలవాట్లు మార్చుకున్నారనే వార్తలను ఖండించారు. నిరాధారమైన వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Sai Pallavi


సౌత్ లో  సినీప్రియులకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ లలో ఒకరు సాయి పల్లవి. తన నటనతో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునే ఆమె ఎప్పటికప్పుడు ఏదో విషంయలో వార్తల్లో నిలుస్తు వస్తున్నారు. ఆమె గతంలో చేసిన కామెంట్స్ సైతం అమరన్ రిలీజ్ సమయంలో వైరల్ అయ్యాయి.

అలాంటి వాటి వల్ల సాయి  పల్లవి విసిగిపోయినట్లుంది. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమెకు రీసెంట్ గా ఓ గాసిప్ కోపం తెప్పించింది. దాంతో ఆమె లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
 


సాయి పల్లవి అంటేనే అందం, అభినయం. గ్లామర్ ప్రదర్శన లేకుండా ఈ రెండింటితోనే  అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. రీసెంట్ గా అమరన్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

శివకార్తికేయన్ హీరోగా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. మరోవైపు రామాయణం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది.  ఈ క్రమంలోనే ఓ వార్త ఆమెకు కోపం తెప్పించింది.
 

Tap to resize


 సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో సీతగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమా కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకున్నారంటూ వస్తోన్న వార్తలపై తాజాగా ఆమె ఘాటుగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన పోస్ట్‌లు పెడితే లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
 


బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో ‘రామాయణ’గా ఇది రానుంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ నటిస్తుండగా.. సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని తమిళంలో ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. 


ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి (Sai Pallavi) మాంసాహారం మానేశారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని ఆ వార్తల సారాంశం. దీనిపై సాయిపల్లవి తాజాగా స్పందించారు. ఇలాంటి నిరాధారమైన రూమర్స్‌ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్‌ యాక్షన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.


‘నాపై ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజమేంటనేది దేవుడికి తెలుసు. కానీ, మౌనంగా ఉంటున్నానని ఇలాంటి రూమర్స్‌ తెగ రాసేస్తున్నారు. ఇప్పుడు ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చింది.

నా సినిమాల విడుదల, నా ప్రకటనలు, నా కెరీర్‌.. ఇలా నాకు సంబంధించి ఏవైనా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే.. అది గుర్తింపుపొందిన మీడియా అయినా నేను చట్టబద్దమైన యాక్షన్‌ తీసుకుంటాను. ఇన్నాళ్లు సహించాను. ఇకపై ఇలాంటి చెత్త కథనాలను మోసుకెళ్లడానికి నేను సిద్ధంగా లేను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Sai Pallavi, amaran


ఇక సినిమాల విషయానికొస్తే..  సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్‌లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య (Naga Chaitanya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. చైతూ.. సాయిపల్లవి డీగ్లామర్‌ లుక్స్‌లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. 

Latest Videos

click me!