మంత్రి మల్లారెడ్డి పెద్ద మనసు (వీడియో)

Nov 27, 2020, 8:05 PM IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు. శుక్రవారం బాలానగర్‌‌ మీదుగా ఆయన వెళ్తుండగా అదే సమయంలో స్కూటీపై వెళ్తున్న మహిళ రోడ్డు ప్రమాదానికి గురైంది.

దీనిని గమనించిన మల్లారెడ్డి తన కాన్వాయ్‌ని ఆపి కిందకు దిగారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను తన కారులోనే ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూడండి.