మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్యకు మధ్యఎంత పోటీ ఉన్నా.. ఇద్దరు మంచిస్నేహితులుగానే ఉంటారు. అంతే కాదు బాలయ్య సినిమాల్లో ఓ మూవీ అంటే మెగాస్టార్ కు చాలా ఇష్టం అంట.. ఎన్నోసార్లు ఈ సినిమా చూశారట. ఇంతకీ ఎంటా సినిమా తెలుసా..?
కెరీర్ పరంగా ఎంత కాంపిటేషన్ ఉన్నా కాని.. పర్సనల్ గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణ. ఒకరి సినిమాలు మరొకరు విష్ చేసుకోవడం.. సినిమా ఫంక్షన్స్ లో సరదాగా ఉండటం. ఇలా ఇద్దరు మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. కాని వారి ప్యాన్స్ మధ్య మాత్రం వార్ నడుస్తూనే ఉంటుంది.
27
టైం దొరికిన .. మనసు బాగో లేకపోయినా.. బోర్ కొట్టిన ఆ సినిమానే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతూంటారట చిరంజీవి. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. బాలయ్య ఫ్యాన్స్ అంతా ఎక్కువగా ఇస్టపడుతూ.. ఎక్కువగా చూడాలి అనుకునే సినిమా ఒకటుంది. అది మరేదో కాదు.. 90స్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సమరసింహారెడ్డి సినిమా.
టైం దొరికిన .. మనసు బాగో లేకపోయినా.. బోర్ కొట్టిన ఆ సినిమానే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతూంటారట చిరంజీవి. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. బాలయ్య ఫ్యాన్స్ అంతా ఎక్కువగా ఇస్టపడుతూ.. ఎక్కువగా చూడాలి అనుకునే సినిమా ఒకటుంది. అది మరేదో కాదు.. 90స్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సమరసింహారెడ్డి సినిమా.
“సమరసింహారెడ్డి”...ఈ సినిమా బాలయ్య కెరీర్ ను మలుపు తిప్పింది. బాలయ్య సినిమాల చరిత్రను తిరగరాసింది. నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఈ మూవీ నందమూడి అభిమానులకు మాత్రమే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు కూడా ఫేవరెట్ గా మారిపోయింది.
సరిగ్గా ఈసినిమా అంటే మెగాస్టార్ చిరంజీవికి కూడా చాలా ఇష్టమట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. బాలయ్య నటించిన అన్ని సినిమాలలోకి తాను పదే పదే చూడాలి అని ఇంట్రెస్ట్ కలిగించే సినిమా సమరసింహారెడ్డి అని అన్నారు బాలయ్య.
ఈసినిమాలో బాలయ్య పెర్ఫామెన్స్ తో పాటు.. మ్యూజిక్.. ఫ్యాక్షన్ కంటెంట్... బాలయ్య చెప్పిన భారీ డైలాగ్స్ తో పాటు.. చెల్లెలి సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అన్నింటికలబోతగా.. సమరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యింది. హీరోలు తొడకొట్టడం అనే ట్రెండ్ ఈసినిమాతోనే స్టార్ట్ అయ్యింది.
77
Chiraneevi
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాలో నటిస్తుండగా..? నందమూరి బాలయ్య బాబీ సినిమాలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ జరుగుతుండగా.. బాలయ్య రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నారు. మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక చిరంజీవి మాత్రం విశ్వంభర షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు.