Oct 11, 2022, 12:25 PM IST
నల్గొండ : ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చండూరులో తనదైన స్టైల్లో వృద్దులను ఆప్యాయంగా పలకరిస్తూ, చిన్నారులు, యువతీయువకులతో సరదాగా ముచ్చటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా తాను ఇంచార్జిగా వున్న చండూరులోని 2,3 వార్డుల్లో మంత్రి ప్రచారాన్ని హోరెత్తించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వారి కష్టసుఖాలను తెలుసుకోవడమే కాదు ఆప్యాయంగా మాట్లాడుతూ, ఫోటోలు దిగుతూ ఓటర్ల మనసులు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.