Dec 2, 2019, 1:04 PM IST
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండమరి గ్రామంలో లో మునిరాజా (29) అనే వ్యక్తి తన సొంత అన్న కూతురిని మాయమాటలు చెప్పి పంటపొలాల వద్దకు తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. అయితేచిన్నారి కేకలు విన్న కొందరు పశువుల కాపరులు మానవ మృగం నుండి చిన్నారిని రక్షించి గ్రామస్తులకు సమాచారం అందించారు. మునిరాజాకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.