Can Baby Powder Be Danger to Child Health
పిల్లలకు స్నానం చేసిన తర్వాత కామన్ గా చాలా మంది పేరెంట్స్ చేసే పని వారి శరీరానికి పౌడర్ రాస్తూ ఉండారు. అలా పౌడర్ రాస్తే.. పిల్లలు ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటారని నమ్ముతారు. అంతేకాదు… పిల్లల నుంచి మంచి సువాసన కూడా వస్తుందని అనుకంటారు. ఇది నిజమే.. కానీ, పిల్లలకు అసలు పౌడర్ రాయడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం…
నిపుణుల ప్రకారం పిల్లలకు పొరపాటున కూడా పౌడర్ రాయకూడదు. ఎందుకంటే..ఆ పౌడర్ వారికి ముక్కు, నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరిపోయే ప్రమాదం ఉంది. దీని కారణంగా పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా?
మీరు చదివింది అక్షరాలా నిజం. బేబీ పౌడర్ లో డైలాగ్ అనే ఖనిజ సమ్మేళనం ఉంటుంది. ఇందులో ఆస్బెస్టాస్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అందువల్ల బేబీ పౌడర్ ను బేబీకి పూస్తే అది పీల్చినప్పుడు వారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ప్రతి తల్లి తన బిడ్డకు పౌడర్ రాసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
పిల్లలకు పౌడర్ రాసే సమయంలో తల్లులు గుర్తుంచుకోవలసిన విషయాలు:
- తల్లులు తమ పిల్లలకు పౌడర్ రాసేటప్పుడు నేరుగా ముఖానికి రాసుకోకుండా ఆ పౌడర్‌ను ఒక క్లాత్ కి రాసి పిల్లలకు పూయాలి.
- పిల్లలకు పౌడర్ వేసేటప్పుడు ఆ పౌడర్ కళ్లలోకి, నోటిలోకి, ముక్కులోకి రాకుండా చూసుకోవాలి. లేకపోతే, అనేక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది.
- అదేవిధంగా, స్నానం చేసిన వెంటనే మీ శిశువు చర్మానికి పౌడర్ వేయవద్దు. పూర్తిగా తండి అంతా పోయిన తర్వాత మాత్రమే పౌడర్ రాయాలి.
- అలాగే, చాలా మంది తల్లులు డైపర్ పెట్టే ముందు తమ బిడ్డ ప్రైవేట్ భాగాలకు పౌడర్ వేస్తారు. కానీ అది తప్పు. ఇది శిశువు ఆ భాగాలలో చికాకు ,అలెర్జీల వంటి సమస్యలను కలిగిస్తుంది. బదులుగా, మీరు శిశువు చేతులు, కాళ్ళు ,తొడలపై పౌడర్ రాయవచ్చు.
ముఖ్యమైన గమనిక:
మీ పిల్లలపై పౌడర్ ని ఉపయోగించే ముందు, అది మంచి నాణ్యతతో ఉందని నిర్ధారించుకోవడానికి వైద్యుడిని సంప్రదించండి, లేకుంటే అది అలెర్జీలకు కారణం కావచ్చు. అదేవిధంగా, మీ బిడ్డపై ఎక్కువ పౌడర్ ని ఉపయోగించవద్దు. మితంగా మాత్రమే వాడాలి.