Jul 14, 2020, 11:18 AM IST
అధికార పార్టీ కార్పొరేటర్ ఓ భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా..దీనిపై ప్రశ్నించినందుకు తన భర్తపై తన అనుచరులతో కలిసి దాడి చేశారని ఓ మహిళా రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. మేడ్చెల్ జిల్లా, బోర్డుప్పల్, ద్వారకా నగర్ లో ఆరు సంవత్సరాల క్రితం బాంక్ ద్వారా కొన్న ఇల్లులో తమకు వాటా ఉన్నదని స్థానిక టీఆరెస్ కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీనితో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో తన భర్త పురెందర్ రెడ్డి పై కార్పొరేటర్ తో పాటు తన అనుచరులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేయడంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారని బాధిత మహిళా ఆనంతుల బానోదయా కమిషన్ కు వివరించింది. ఈ సంఘటన పై మేడిపల్లి పోలీసుస్టేషన్ లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ కార్పొరేటర్ తో కుమ్మకైన పోలీసులు తిరిగి తమపై అక్రమంగా కేసు పెట్టి వేదిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి కార్పొరేటర్, తన అనుచరులపై కేస్ నమోదు చేయకుండా, అరెస్ట్ చేయలేదని ఆమె పేర్కొన్నారు. కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్ తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని, తమకు రక్షణ కల్పించడంతో పాటు చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన మేడిపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బానోదయా హెచ్చార్సీని వేడుకుంది.