Sep 8, 2021, 10:55 AM IST
ములుగు: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ములుగు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో లక్నవరం చెరువులోకి కూడా భారీ నీరు చేరింది. ఇలా చెరువులో నీటిమట్టం పెరిగడంతో పర్యాటకుల కోసం ఏర్పాటుచేసిన కేబుల్ బ్రిడ్జితో పాటు కాటేజీతో పాటు రెస్టారెంట్ నీటమునిగాయి. భారీగా వరద నీరు వస్తుండటంతో కేబుల్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటకులను నిలిపివేశారు.