ఎస్సై వేధింపులు... పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

Apr 27, 2021, 11:24 AM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎస్సై శివకృష్ణ వేధింపులు భరించలేకపోతున్నానంటూ తిర్మలపూర్ గ్రామానికి చెందిన గంగరాజం అనే వ్యక్తి, పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తమకి న్యాయం కావాలని పోలీసుస్టేషన్ కి వెళ్తే తననే అకారణంగా కొట్టి భయభ్రాంతులను గురి చేసాడని కుటుంభీకులు ఆరోపిస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గంగరాజం ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.