తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్నారు. గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను ఆధునికీకరించడంతో తన వంతు సాయం చేశారు. తాజాగా బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షు ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు తొలిసారి వచ్చిన్నప్పుడు, ఇక్కడి పరిస్ధితిని చూసి తాను కంటతడి పెట్టినట్లు హిమాన్షు చెప్పారు.