Jul 6, 2021, 6:10 PM IST
హైదరాబాద్: వైసిపి రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థపై ఇవాళ(మంగళవారం) ఐటీ అధికారులు దాడి చేశారు. గచ్చిబౌలిలోని రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణలోని రాంకీ అనుబంధ సంస్థల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నారు. మొత్తం 15 ఐటీ బృందాలు వైసిపి ఎంపీకి సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.