అంబేద్కర్ కు ఘోర అవమానం...నోట్లో సిగరెట్ పెట్టి తిట్లపురాణం

Apr 23, 2021, 6:18 PM IST

రేపల్లె: భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కొందరు ఆకతాయిలు ఘోరంగా అవమానించారు. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం  గుళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం నోట్లో సిగరెట్ పెట్టి అవమానకరంగా ఆయనను దూషించారు కొందరు యువకులు. అంతేకాకుండా విగ్రహం చెంపపై కొడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.