Dec 1, 2021, 4:28 PM IST
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఈటల కాస్సేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.