vuukle one pixel image

ధర్మపురి ఎలక్షన్ రిజల్ట్ వివాదం... తేనేటీగల దాడితో అధికారుల పరుగు

Apr 10, 2023, 2:15 PM IST

జగిత్యాల : ధర్మపురి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల పలితాల వివాదం నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవిఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూం ను తెరిచి 17ఏ,17సి డాక్యుమెంట్ కాపీలతో పాటు సిసి పుటేజి,ఎన్నికల ప్రొసీడింగ్స్ ను సమర్పించాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇవాళ మల్యాల మండలం నూకపల్లిలోని విఆర్కె ఇంజనీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూం ను తెరిచేందుకు అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో వారిపై తేనెటీగలు దాడి చేయడంలో కాస్సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా తేనెటీగలు లేవడంలో అధికారులంతా పరుగు తీసారు.