ఛాంపియన్స్ ట్రోఫీ 2025: నాకేం బాధ‌గా లేదు.. సూర్యకుమార్ యాద‌వ్

Published : Jan 21, 2025, 10:47 PM IST

Suryakumar Yadav: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే, జట్టులో చోటు దక్కకపోవడంపై టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.  

PREV
15
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: నాకేం బాధ‌గా లేదు.. సూర్యకుమార్ యాద‌వ్
Suryakumar Yadav

Suryakumar Yadav: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ 15 మంది సభ్యుల జట్టులో పెద్ద మ్యాచ్ విన్నర్‌కు చోటు దక్కలేదు. దీనిపై, ఈ 'ఎక్స్-ఫాక్టర్' క్రికెటర్‌ను భారతదేశం ఖచ్చితంగా కోల్పోతుందని భారత మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ రైనా అన్నారు. అత‌నే సూర్య కుమార్ యాద‌వ్. 

25

రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను భారత్ కోల్పోతుందని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. అతను జట్టుకు 'ఎక్స్ ఫ్యాక్టర్' అని నిరూపించుకోగలడని చెప్పాడు. దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సూర్య‌కు చోటు ద‌క్క‌లేదు. 

టీ20 క్రికెట్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌ను ఆడే భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ట్టులో త‌న‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై మంగళవారం స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుండి త‌న‌ను మినహాయించడాన్ని తాను అంగీకరించాన్నాడు. అలాగే, వ‌న్డే ఫార్మాట్‌లో బాగా రాణించలేకపోవడమనేది ఐసీసీ ఈవెంట్‌కు ఎంపికైన జ‌ట్టులో లేక‌పోవ‌డం కంటే ఎక్కువగా తనను బాధపెడుతోందని చెప్పాడు. 

35

ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భార‌త జ‌ట్టులో సూర్యకుమార్‌ను సెలెక్టర్లు విస్మరించారు, అయితే బుధవారం ఇక్కడ ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో జోస్ బట్లర్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్‌తో తలపడే టీమిండియాకు సూర్య సార‌థిగా ఉన్నాడు. 

అద్భుత‌మైన స్ట్రైక్ రేటు, ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లు ఆడుతూ క్ష‌ణాల్లో మ్యాచ్ ను మ‌లుపు తిప్ప‌గ‌లిగే సామ‌ర్థ్యంలో స్టార్ T20 క్రికెటర్లలో ఒకరిగా సూర్య కుమార్ యాద‌వ్ గుర్తింపు పొందాడు. అయితే ఆ ఫామ్ 50 ఓవర్ల క్రికెట్‌లో కొన‌సాగించ‌లేక‌పోతున్నాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ 37 వ‌న్డేల‌లో 25.76 సగటుతో 773 పరుగులు చేశాడు.

45
Suryakumar Yadav

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 కోసం భార‌త జ‌ట్టులో త‌న‌ను చేర్చుకోక‌పోవ‌డం బాధ కలిగించిందా అని మీడియా ప్ర‌శ్నించ‌గా, త‌న‌కు ఎలాంటి బాధ‌లేద‌ని చెప్పాడు. "ఎందుకు బాధ ఉంటుంది. నేను బాగా ఆడి వుంటే ఛాంపియన్స్ ట్రోఫీ జ‌ట్టులో ఉండేవాడిని. నాకంటే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారు జ‌ట్టులో ఉన్నారు. నేను వన్డేల్లో బాగా రాణించ‌నందుకు బాధ‌ప‌డుతున్నాను" అని తెలిపాడు.

"నేను బాగా ఆడ‌లేద‌నే విష‌యం త‌ల‌చుకుంటే బాధగా ఉంది. నేను బాగా చేసి ఉంటే, నేను అక్కడే ఉండిపోయేవాడిని. నేను బాగా చేయకపోతే, నిజంగా బాగా చేసిన అర్హత ఉన్న వ్యక్తి అక్కడ ఉండటానికి అర్హుడని" చెప్పాడు. 

55
Rohit Sharma, Suryakumar Yadav,

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు ఛాంపియన్స్ ట్రోఫీలో భార‌త జ‌ట్టులో ఉంటే ఏ ప్రత్యర్థి జ‌ట్టుకైనా వ‌ణుకు పుడుతుంద‌ని సూర్య కుమార్ యాద‌వ్ చెప్పాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ లో అద్బుత‌మైన బౌలింగ్ తో బుమ్రా అద‌ర‌గొట్టాడు. అయితే, సిడ్నీ టెస్టు తర్వాత బుమ్రా బౌలింగ్ చేయలేదు. వెన్ను నొప్పి కారణంగా రాబోయే టీ20ల‌కు కూడా దూరం అయ్యాడు. 

"వారు కలిసి చాలా క్రికెట్ ఆడారు. వారు అనుభవజ్ఞులైన బౌలర్లు. మీరు భారతదేశం కోసం ఆడినప్పుడు, అది భిన్నమైన అనుభూతి, విభిన్న భావోద్వేగం. అదనపు బాధ్యతను మీరు ఇష్టపడతారు. కాబట్టి, వారు మళ్లీ కలిసి బౌలింగ్ చేయడం సరదాగా ఉంటుంది. 2023 ODI ప్రపంచ కప్‌లో మనం చూసినట్లుగా. ఛాంపియన్స్ ట్రోఫీలో అదే బౌలింగ్‌ను చూస్తామని ఆశిస్తున్నాము" అని సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు.  

Read more Photos on
click me!

Recommended Stories