యోగిబాబు తమిళ సినిమాల్లో ప్రముఖ హాస్యనటుడుగా రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన బాగా పాపులర్ అయ్యారు. స్టార్ కమెడియన్‌గా మెప్పిస్తున్నారు. రజినీకాంత్, విజయ్, సూర్య, రవిమోహన్, విజయ్ సేతుపతి, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి చాలా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్ అయ్యారు. హాస్యనటుడిగానే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు.