నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద.. తెరుచుకోనున్న గేట్లు..

Aug 21, 2020, 10:10 AM IST

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్గొండజిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదనీరు ముచ్చెత్తుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 581 అడుగుల ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఎన్ఎస్పీ అధికారులు ఈ రోజు ఉదయం 11 గంటలకు సాగర్ డ్యామ్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని పులిచింతల ప్రాజెక్ట్ కు వదలనున్నారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా సాగర్ లో పర్యాటకులకు అనుమతి నిరాకరించారు, 144 సెక్ష న్ అమలులో ఉంది. ఇక వరద నీరు భారీగావస్తున్న కారణంగా జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.