పెట్రోల్ బంక్ లో చెలరేగిన మంటలు.. కానీ.. అదే కాపాడింది..

Jul 30, 2020, 12:36 PM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఓ పెట్రోల్ బంక్ లో సిబ్బంది చాకచక్యం వల్ల పెను ప్రమాదం తప్పింది. టూ వీలర్ లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే పెట్రోల్ కొట్టడం ఆపేశారు. టూవీలర్ మీదున్న వాళ్లు బండిని వదిలేసి పారిపోయారు. పెట్రోల్ బంక్ సిబ్బంది చాకచక్యంగా ఫోమ్ వాడి మంటలను ఆర్పేయడంతో భారీ ప్రమాదం తప్పింది.