Jan 9, 2023, 5:02 PM IST
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ వివాదం తెరపైకి వచ్చింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ సమీప గ్రామాల ప్రజలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రజావాణిలో భాగంగా నర్సింగాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల రైతులు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. రీ క్రియేషన్, ఇండస్ట్రియల్ జోన్ల కింద దాదాపు వెయ్యి ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్దంకావడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను కనీసం సంప్రదించకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని... వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని జగిత్యాల రైతులు హెచ్చరిస్తున్నారు.