నారాయణగూడలో గస్తీ నిర్వహించిన సీపీ అంజనీకుమార్ (వీడియో)

Aug 23, 2019, 4:36 PM IST

 హైద్రాబాద్ సీపీ అంజనీ కుమార్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గస్తీ వాహనంలో తిరిగారు. పోలీస్ గస్తీ వాహనంలో కానిస్టేబుల్స్ రమేష్,సాయికుమార్, డ్రైవర్ రమేష్ లతో కలిసి ఆయన గస్తీ నిర్వహించారు.

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్ వాడీ,నారాయణగూడ, అవంతీనగర్ తదితర ప్రాంతాల్లో ఈ నెల 22వ తేదీ రాత్రి 10 గంటల నుండి 11గంటల వరకు గస్తీ నిర్వహించారు.

ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కువగా దొంగతనాలు చోటు చేసుకొంటాయి, రౌడీషీటర్ల ఇళ్లు ఎక్కడ తదితర విషయాలపై గస్తీ వాహనంలో ఉన్న కానిస్టేబుళ్లకు అవగాహన ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించారు.