Aug 3, 2020, 6:44 PM IST
రాజన్న సిరిసిల్లా జిల్లాలో కరోణా వ్యాప్తి నేపథ్యంలో ఐటి, పురపాలక శాఖా మంత్రి కేటిఆర్ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ చికిత్స కోసం వార్డును, ఐదు అంబులెన్స్ లను ప్రారంభించారు. ఆసుపత్రిలో మౌళికవసతులకోసం 2కోట్ల 28లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో కరోనా వార్డును ప్రారంభించి వార్డులోని సౌకర్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలోనే ఐదు అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సర్దాపూర్ లోని అగ్రికల్చర్ కళాశాలలో 32పడకలతో ఐసోలేషన్ వార్డును ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటిఆర్ మాట్లాడుతూ...... జిల్లా ప్రభుత్వాసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ కొరకు 2.2 కోట్ల రూపాయలను సాయంత్రంలోగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.