Jul 31, 2020, 11:07 AM IST
కరోనా సోకిందంటే చాలు.. జనాలు భయపడడమే కాదు కరోనా బాధితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి దారుణ సంఘటనే నారాయణ్ ఖేడ్ లోని ఖానాపూర్ లో చోటుచేసుకుంది. కరోనా పాటిజివ్ వచ్చిన వారిని గ్రామస్తులు నేరుగా స్మశానంలోనే ఉంచేశారు. స్మశానంలోని ఓ గదిలో ఐసోలేషన్ చేశారు. వారికి సరైన, ఆహారం, వైద్యం అందక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.