Nov 29, 2019, 3:39 PM IST
గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలంటూ ప్రముఖ హాస్యనటులు అలీ, కృష్ణ భగవాన్, రఘు బాబులు పిలుపునిచ్చారు.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ జీహెచ్ఎంసీ పార్క్ లో వీరు మొక్కలు నాటారు.
ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనే ప్రతీ వ్యకి 3 మొక్కలు చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని నామినేట్ చేస్తారు. అందరూ చెట్టుబతికినన్నాళ్లూ ఆరోగ్యంగా బతకాలని రఘుబాబు అన్నారు.