పుష్ప 2 చిత్రం దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ సంచలనం సృష్టిస్తోంది. కానీ అల్లు అర్జున్ మాత్రం కేసుల్లో చిక్కుకుని సతమతమవుతున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ తాజాగా మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ఇదంతా పుష్ప 2 రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ ప్రదర్శించడం వల్లే జరిగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మృతి చెందింది.
Allu Arjun
దీనితో ఇకపై టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు ఉంటాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. టాలీవుడ్ లో నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా చిత్రం రాంచరణ్ గేమ్ ఛేంజర్. ప్రభుత్వాలు కూడా ఇకపై మిడ్ నైట్ షోలు, బెనిఫిట్ షోల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు.
ఇంత రచ్చ జరిగినా రాంచరణ్, గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ మాత్రం డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు తెలుస్తోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్ అవుతోంది. జనవరి 9న రాత్రి వరల్డ్ వైడ్ గా గేమ్ ఛేంజర్ ప్రీమియర్ షోలు ఉంటాయి అని చిత్రయూనిట్ చెబుతున్నారు.
వరల్డ్ వైడ్ గా అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా అనే డౌటు కూడా ఉంది. కానీ రాంచరణ్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఉండకుండా ఉండే పరిస్థితి ఉండదు అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి అనుమతుల విషయంలో దిల్ రాజు ఎలా చక్రం తిప్పుతారో చూడాలి.