KCR Birhtday:మనవడు హిమాన్షుతో కలిసి పావురాలు ఎగరేసిన కేసీఆర్

Feb 18, 2022, 10:19 AM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిన్న(గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కేసీఆర్ కూడా కుటుంబసభ్యులతో నిన్నంతా సరదాగా గడిపారు. భార్య, కొడుకు,కోడలు, మనవడు, మనవరాలితో కలిసి కేసీఆర్ మొక్కలు నాటారు.అనంతరం మనవడు హిమాన్షుతో కలిసి పంజరంలోని పావురాలకు స్వేచ్చ కల్పిస్తూ గాల్లోకి ఎగరేసారు. ఇలా నిత్యం బిజీబిజీగా వుండే కేసీఆర్ పుట్టినరోజు నాడు కుంటుంబంతో ఆనందంగా గడిపారు.