వనపర్తిలో ఘ‌నంగా సినారె 88వ జయంతి ఉత్సవాలు (వీడియో)

Jul 28, 2019, 4:50 PM IST

ప్రముఖ కవి సి.నారాయణ రెడ్డి 88వ జయంతి ఉత్సవాలు వనపర్తిలో జరిగాయి. పట్టణంలోని పద్మావతి గార్డెన్స్‌లో జరిగిన కవి సమ్మేళనానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో రామప్ప నాటక ప్రదర్శనతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు, పేరిణీ నృత్యంతో పాటు ప్రముఖ సినీ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ బృందం ఆధ్వర్యంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు.