Jan 7, 2021, 4:52 PM IST
హైదరాబాద్: సిఎం కేసీఆర్ కు ఊపిరితిత్తుల్లో మంట(lungs burning)గా ఉండడంతో వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ కు వెళ్లారు. బుధవారమే ఆయన వ్యక్తిగత వైద్యులు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణులు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణులు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో వాటికోసం ఇవాళ ఆయన యశోద హాస్పిటల్ కు వచ్చారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన తనయుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా యశోదాకు వెళ్లారు.