Jan 20, 2022, 3:14 PM IST
పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని తిరుపతి అనే వ్యక్తి ఇంటి ముందు నల్ల కోడిని బలిచ్చి, అందులో అన్నం ముద్దలు, పసుపు, కుంకుమ, జీడిగింజలు, మిరపకాయలు, నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని తిరుపతి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
తమ కుటుంబసభ్యులకు ఏమైనా అవుతుందేమోనని తిరుపతి ఆందోళన చెందుతున్నారు. క్షుద్రపూజల ఆనవాళ్లను చూసేందుకు స్థానికులు తిరుపతి ఇంటివద్దకు చేరుకుంటున్నారు. భూతవైద్యులు, క్షుద్రపూజలు చేసే మంత్రగాళ్లను కనిపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసులను బాధిత కుటుంబం, స్థానికులు వేడుకుంటున్నారు.