Dec 26, 2021, 3:08 PM IST
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పై గెలిచి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఈటల రాజేందర్ దేవుళ్లకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పటికే పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించిన ఆయన ఇవాళ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. మలన్న కల్యాణోత్సవానికి హాజరై మొక్కులు చెల్లించుకున్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈటల సతీమణి జమున రాజేందర్. ఇక నుండి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని ఈటల జమున తెలిపారు.