Dec 19, 2021, 3:03 PM IST
మెదక్: బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వెల్దుర్తి మండలకేంద్రంలో బీజేపీ జెండాతో పాటు ముదిరాజ్ సంఘం జెండాను కూడా ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. అలాగే రాజ్యాంగ రూపశిల్పి డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెల్దుర్తి మండలం మెల్లురు గ్రామానికి చేరుకున్న ఈటలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నేరుగా గ్రామదేవతల గుడికి వెళ్లిన ఈటల ప్రత్యేక పూజలు చేసారు