Dec 6, 2019, 9:39 AM IST
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. షాద్‌నగర్ కోర్టు ఆదేశం మేరకు నిందితులను చర్లపల్లి జైలు నుండి పోలీసులు తమ కస్టడీకి తీసుకొన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున నిందితులతో పోలీసులు చటాన్‌పల్లి వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి పోలీసుల ఆయుధాలు లాక్కోని వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు.