Sep 11, 2023, 3:50 PM IST
పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.. 98 సంవత్సరాల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్ తో దాడి చేసి తలపై తీవ్రంగా కొట్టడంతో వృద్దురాలు అక్కడికక్కడే చనిపోయింది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు చందపల్లిలో నాంపల్లి రాజమ్మ(90) ని సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు తలపై ఇనుప రాడ్ తో బాదటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పెద్దపల్లి సిఐ అనిల్ కుమార్ తెలిపారు మృతురాలు మనవడిని పోలీసులు అదుపులో ఉంచుకున్నట్టు సమాచారం..