ఆల్టో, బీరూట్ యూనివర్సిటీల వాళ్లు కలిసి 'సెల్ఫ్ హీలింగ్ హైడ్రో జెల్' కనిపెట్టారు. ఈ జెల్ మన చర్మంలాగే పనిచేస్తుంది. చర్మంలాగే ఉంటుంది. ఈ మందు గంటల్లోనే చర్మంపై గాయాన్ని నయం చేసి మామూలు స్థితికి తెస్తుంది. నానో షీట్ ద్వారా ఈ పరిష్కారం కనుగొన్నామని చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ గురించి మార్చి 7న నేచర్ మెటీరియల్స్ పత్రికలో రాశారు.