వైఎస్ జగన్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ: రోజా సహా కొత్త మంత్రుల జాబితా రెడీ

Mar 18, 2022, 11:01 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 27వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. జగన్ కొలువులో కొత్తగా చేరే మంత్రుల జాబితా కూడా ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఐదుగురు మంత్రులను మాత్రం వైఎస్ జగన్ కొనసాగించడానికి నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.