Jan 17, 2022, 8:02 PM IST
కేరళలోని ఈ ప్రాథమికోన్నత పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్ తో పాటుగా మొదటి ఫ్లోర్ లో కూడా విస్తరించి ఉంది. కానీ ఇప్పటివరకు పై ఫ్లోర్ లో ఉన్న క్లాసు రూముల్లో ఒక్క క్లాస్ అంటే ఒక్క క్లాస్ కూడా అవలేదు. కారణం తెలుసా..? పైకి ఎక్కడానికి మెట్లు లేకపోవడం. పైకి చేరుకోవాలంటే ఒక రెండు మూడు సర్కస్ ఫీట్లు చేయాల్సి ఉంటుంది. స్కూల్ ప్రహరీ గోడ పైన నడుచుకుంటూ టాయిలెట్స్ పైకి ఎక్కి ఒక చెక్క మీదకు దూకి పైకి చేరుకోవలిసి ఉంటుంది. ఈ సర్కస్ ఫీట్లకు భయపడి ఆ ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉంది. స్కూల్ ని కట్టేటప్పటికీ నిధులు అయిపోవడంతో మెట్లను కట్టలేదు. ఏషియా నెట్ న్యూస్ ప్రతినిధులు ఈ విషయం పై నిలదీయడంతో లక్ష రూపాయలను పంచాయతీ విడుదల చేసింది.