అయోధ్య రామమందిర నిర్మాణం... సరికొత్త అధ్యాయానికి నాంది..!

May 21, 2023, 12:00 PM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ ప్రదేశాన్ని  మిలియన్ల మంది ప్రజలు శ్రీరాముని జన్మస్థలంగా నమ్ముతారు. అయితే అక్కడ వివాదస్పద స్థలానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, మత, న్యాయపరమైన వివాదాలు వందేళ్లకు పైగా భారతదేశాన్ని కుదిపేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అయోధ్య కొంత కీర్తిని  కోల్పోయింది. అయితే 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీం కోర్టు రామ మందిరం నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. అయోధ్య చరిత్రలో సరికొత్త అధ్యాయనం మొదలైంది.రామమందిరం నిర్మాణం ఎప్పుడూ పూర్తవుతుందా?.. కొత్త ఆలయంలో తమ ప్రియమైన దేవుడిని దర్శించుకునేందుకు ఎప్పటి నుంచి అనుమతిస్తారా? అని రామభక్తులు ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పట్ల భారతదేశంలోనే కాకుండా.. విదేశాల్లో స్థిరపడిన హిందువులు కూడాఎంతో ఆసక్తితో ఉన్నారు. ఆ పూర్తి వివరాలతో కూడిన ఈ వీడియో మీకోసం...