పంజాబ్ : పేద పిల్లలకు చదువు చెబుతున్న సెక్యూరిటీ గార్డు

Feb 4, 2020, 10:06 AM IST

వలస కార్మికుల పిల్లల కోసం 62 ఏళ్ల ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నిర్మల్ సింగ్ పాఠశాల నడుపుతున్నాడు. రోపర్ జిల్లా నివాసి నిర్మల్ సింగ్ పేద పిల్లలకు చదువుతో పాటు, ఆటవస్తువులు, పుస్తకాలు, దుస్తులు, ఆహారం అందిస్తున్నాడు. వ్యక్తిగత పరిశుభ్రతమీద అవగాహన కల్పిస్తున్నాడు. ఇటు కాపలా కాస్తూనే అటు పిల్లలకు ఇంగ్లీష్, పంజాబీ, హిందీ, మ్యాథ్స్ బోధిస్తున్నాడు. పేద పిల్లలకు చదువు చెప్పడం నా చిన్ననాటి కల. మురికివాడల్లో నివసిస్తున్న ఈ పిల్లల తల్లిదండ్రులను ఒప్పించడానికి నాకు ఒక సంవత్సరం పట్టిందని నిర్మల్ అంటున్నాడు. ప్రస్తుతం నిర్మల్ దగ్గర చదువుకునే పిల్లలు 60మంది దాకా ఉన్నారు.