నాకేం కాలేదు..బాగానే ఉన్నాను... : రజనీకాంత్

Jan 29, 2020, 11:08 AM IST

కర్ణాటకలోని బండిపూర్ అడవిలో బ్రిటిష్ సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా జనవరి 28 న మెగాస్టార్ రజనీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన తరువాత చెన్నైకి చేరుకున్న రజనీకాంత్...చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ “మ్యాన్ వర్సెస్ వైల్డ్” ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశాను. నాకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ చిన్న ముళ్ళ కారణంగా గీతలు పడ్డాయి. నేను బాగానే ఉన్నాని చెప్పారు.