రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించిన భారత్

Jan 29, 2020, 9:29 AM IST

చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ అవతరించింది. ఈ విషయంలో భారత్ అమెరికాను అధిగమించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలున్నాయి. దీని ప్రకారం 2019 లో భారతదేశంలో స్మార్ట్ఫోన్ ఎగుమతులు 7.7 శాతం పెరిగాయి. మొత్తంగా అమ్మకాలు 158 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయట. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ అమ్మాకాలు ఎక్కువగా జరిగాయట. దీనికి కారణం తక్కువ ధరలతో మధ్యతరగతికి అందుబాట్లో ఉండే చైనా బ్రాండ్లేనని, ఇవి గట్టిపోటీనిచ్చాయని తేలింది. ఇవే మార్కెట్ ఆధిపత్యానికి సహాయపడ్డాయి.