జబర్దస్త్ గుర్తింపు నాకు వద్దు, ఎన్టీఆర్ మూవీలో ఆ సీన్ నాదే.. బాంబు పేల్చిన బలగం వేణు, హాట్ కామెంట్స్

First Published May 2, 2024, 3:13 PM IST

ఒక్క చిత్రం కమెడియన్ వేణు ఎల్దండి జాతకమే మార్చేసింది. ఆ మూవీనే తెలుగు రాష్ట్రాలని ఊపేసిన బలగం. అప్పటి వరకు అంతా జబర్దస్త్ వేణు అని పిలిచేవారు. ఇప్పుడు బలగం వేణు అని అంటున్నారు.

ఒక్క చిత్రం కమెడియన్ వేణు ఎల్దండి జాతకమే మార్చేసింది. ఆ మూవీనే తెలుగు రాష్ట్రాలని ఊపేసిన బలగం. అప్పటి వరకు అంతా జబర్దస్త్ వేణు అని పిలిచేవారు. ఇప్పుడు బలగం వేణు అని అంటున్నారు. అంతలా బలగం చిత్రం వేణు గుర్తింపుని మార్చేసింది. 

రచనపై మక్కువ ఉన్న వేణు ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలు కన్నాడు. బలగం చిత్రంతో అతడి కోరిక నెరవేరింది. బలగం చిత్రం తర్వాత వేణుకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో వేణు తన కెరీర్, జబర్దస్త్ పై హాట్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ వేణు అనిపించుకోవడం ఇష్టమా లేక బలగం వేణు అనిపించుకోవడం ఇష్టమా అని ఓ ఇంటర్వ్యూలో వేణుకి ప్రశ్న ఎదురైంది. 

Venu Yeldandi

తనకి బలగం వేణు అనే గుర్తింపు బావుందని వేణు తెలిపాడు. జబర్దస్త్ తో వచ్చిన గుర్తింపు వద్దని తెలిపాడు. జబర్దస్త్ కూడా నన్ను ప్రతి ఇంటికి చేరవేసేలా చేసింది. కాదనను. కానీ జబర్దస్త్ కంటే ముందుగా నేను నటుడిని. జబర్దస్త్ లోకి రాకముందే నేను 100 పైగా సినిమాల్లో నటించా. జబర్దస్త్ అనేది నా కెరీర్ మధ్యలో వచ్చింది.. మధ్యలో వెళ్ళింది. జబర్దస్త్ అనేది నా కెరీర్ కాదు. 

నాకు రచనపై ఆసక్తి ఉంది. అందుకే డైరెక్టర్ కావాలనుకున్నా. చాలా చిత్రాలకు కొన్ని సన్నివేశాలు రాశాను. రుద్రమ దేవి చిత్రంలో అల్లు అర్జున్ అన్నకి కొన్ని డైలాగులు రాసాను. ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో ఒక ఫైట్ సీన్ మొత్తం నాదే అని వేణు తెలిపాడు. అలా చాలా కథలు సొంతంగా రాసేవాడిని. జబర్దస్త్ నాకు చాలా ఇచ్చింది. అందులో సందేహం లేదు. 

జబర్దస్త్ నా కెరీర్ కాదు అని డిసైడ్ అయి బయటకి వచ్చా. జబర్దస్త్ తర్వాత నేను నటించిన పాత్రలో క్లిక్ కావడం లేదు. బలగం చిత్రంలో నేనే హీరోగా నటించాలని నా కోసం ఆ కథ రాసుకున్నా. కానీ నేను హీరో అయితే ఆదరణ ఉండదని గ్రహించా. ఇంట్లో మనిషి చనిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనే ఆలోచనలో బలగం కథ మొదలు పెట్టా. కొన్ని సీన్లు రాసి నా పక్కన వాళ్ళకి వినిపించా.

సూపర్ గా ఉంది.. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. ఆ ఉత్సాహంతోనే కథ మొత్తం కంప్లీట్ చేసినట్లు వేణు తెలిపారు. షూటింగ్ లొకేషన్స్ లో డైరెక్టర్లు ఆర్టిస్టులని కొడతారు కదా అనే ప్రశ్నకు కూడా వేణు బదులిచ్చాడు. షూటింగ్ లో 100 టెన్షన్స్ ఉంటాయి. ఆర్టిస్ట్ సరిగ్గా పొజిషన్ లోకి లేకపోయినా, సరైన టైంలో రాకపోయినా డైరెక్టర్ పై ఒత్తిడి పెరుగుతుంది. 

ఆ ప్రెజర్ లో కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. అంతే కానీ ఏ దర్శకుడు షూటింగ్ అయిపోయాక ఏ ఆర్టిస్ట్ ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయరు అని వేణు తెలిపారు. డైరెక్టర్ తేజని సమర్థిస్తూ వేణు ఈ కామెంట్స్ చేశారు. 

click me!