రక్తహీనత
చాలా మందికి రక్తహీనత సమస్య ఉంటుంది. ముఖ్యంగా మగవారి కంటే ఆడవారే రక్తహీనత సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే ఈ రక్తహీనత ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖర్జూరాలను పాలలో నానబెట్టి తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇది శరీరంలో రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. ఒంట్లో రక్తాన్ని పెంచుతుంది.
dates
ఎముకల ఆరోగ్యం
ఖర్జూరాల్లో విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకలను ఆరోగ్యంగా, బలంగా చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇకపోతే పాలలో ఉండే అదనపు క్యాల్షియం కూడా మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పాలలో నానబెట్టిన ఖర్జూరాలను రోజూ ఉదయం తింటే ఎముకల సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
heart
గుండె ఆరోగ్యం
ఖర్జూరాలు, పాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శక్తి
ఉదయాన్నే ఖర్జూరాలను తిని, పాలు తాగడం వల్ల అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఖర్జూరాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు, పాలలో ఉండే అమైనో ఆమ్లాలు మీకు కావాల్సిన శక్తిని అందిస్తాయి.
అధిక రక్తపోటు
ఖర్జూరాలు పొటాషియానికి మంచి వనరులు. ఇవి రక్తపోటు పేషెంట్లకు మంచి ప్రయోజరకరంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అలాగే పాలిచ్చే తల్లులు పాలలో ఖర్జూరాలను కలిపి తింటే తల్లిపాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే అంగస్తంభన సమస్యతో బాధపడేవారికి కూడా ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరాలను రోజూ పాలలో నానబెట్టి ఉదయాన్నే తింటే పురుషుల్లో అంగస్తంభన తగ్గుతుంది.