కేవలం సెలవుల కోసమే... తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు

Nov 8, 2021, 12:47 PM IST

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుకుమార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెలవు విషయంలో వివాదం తలెత్తగా ఓ జవాన్ తోటి జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే  మృతిచెందగా మరో ముగ్గురి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేవలం సెలవు కోసం జవాన్ల మధ్య మొదలైన ఘర్షణ చివరకు నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. సహనం కోల్పోయిన జవాన్ క్షణికావేశంలో తన దగ్గరున్న తుపాకీతో కాల్పులకు దిగి తోటివారి ప్రాణాలను బలితీసుకున్నాడు. కాల్పులు జరిపిన జవాన్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు