Mar 14, 2022, 10:59 AM IST
యుద్ధం వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది..తమ దేశం పై రష్యా దురాక్రమణతో ప్రాణాలతో మిగిలి ఉంటే చాలు అనుకుంటూ కడసారిది వీడ్కోలు అంటూ తమ మాతృ భూమిని వదిలి కళ్ళల్లో నీరు గుండెల్లో బాధ నింపుకుని దేశ సరిహద్దులకు తరలి వస్తున్నారు...అక్కడి నుండి పోలాండ్ కో లేదా మరో దేశానికీ వెళ్లొచ్చు అన్న ఆశ తో చిన్న పిల్లలతో అక్కడ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు..అక్కడ వారికి సహకరించడం లో వారికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యటంలో వలంటీర్ల పాత్ర ఎనలేనిది...ప్రపంచవ్యాప్తం గా అనేక దేశాలనుండి వీరికి సహాయం చెయ్యటం కోసం ఉక్రెయిన్ బోర్డర్ కు చేరుకొని మేమున్నాం అంటూ ఆపన్న హస్తాలు అందిస్తున్నారు...స్వీడన్ నుంచి వీరికి సహాయం చెయ్యటం కోసం అక్కడే బస చేసిన యువ వాలంటీర్ లూకస్ తో యుద్ధ వార్తలు మీకు అందిచడానికి ప్రాణాలకు తెగించి అక్కడే ఉంటున్న మా ఆసియానెట్ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం ముచ్చటించి కాందిశీకులుగా మారిన ఉక్రెయిన్ పౌరులకు వారు అందించే సహాయం గురించి తెలుసుకోవడం జరిగింది..ఆ వీడియో ఎక్స్ క్లూసివ్ గా మీకోసం...