Galam Venkata Rao | Published: Feb 8, 2025, 5:01 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. మోదీ మంచి పాలనకు ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.