కేరళలో ఘోర ప్రమాదం:రెండు ముక్కలైన ఎయిరిండియా విమానం

Aug 7, 2020, 9:54 PM IST

వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుండి కేరళలోని కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా .విమానం రాత్రి 7.40 నిమిషాలకు లాండింగ్ అవుతుండగా ప్రమాదానికి కారణమయింది . భారీ వర్షం కారణంగా పైలట్ కి రన్వే కనపడక 30 అడుగుల లోతుకి పడిపోయి విమానం రెండు ముక్కలు అయింది . మొత్తం విమానంలో 195 మంది ప్రయాణికులు ,ఏడుగురు సిబ్బంది వున్నారు .పైలట్, కో పైలట్ సహా 5గురు మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే ఆస్కారముంది. 20 అంబులెన్సులు సహాయక చర్యలో పాల్గొంటున్నాయి .