Jul 31, 2020, 11:48 AM IST
గుంటూరు జిల్లా GGH ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం కరోనాపాజిటివ్ రావడంతో ఓ తల్లి, తన రెండు నెలల బిడ్డతో జీజీహెచ్ లో చేరింది. అయితే చేరినప్పటినుండి బాబుకు ఎలాంటి వైద్యం అందలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంజెక్షన్ లోడ్ చేసి చెయ్యకుండా సిబ్బంది వదిలేశారు. ఎన్నిసార్లు అడిగినా మాది కాదని పట్టించుకోలేదని ఆవేదన. బాబును కాపాడమంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్ అవ్వడంతో ఆస్పత్రి ఆర్ఎంఓ రియాక్టయ్యాడు.