విరాట్ కోహ్లీ- క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్

First Published | Dec 14, 2024, 9:13 PM IST

Chris Gayle's all-time T20 record breaks: సెంచూరియన్ టీ20లో బాబర్ ఆజం చ‌రిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో 11000 పరుగులు పూర్తి చేశాడు. అలాగే, రన్ మిషన్ విరాట్ కోహ్లీ, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ తో పాటు ప‌లువురు స్టార్ల రికార్డుల‌ను బ్రేక్ చేశాడు.
 

cricket chris gayle

Chris Gayle's all-time T20 record breaks: స్టార్ బ్యాట‌ర్ బాబర్ అజామ్ దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20లో తన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ జాతీయ క్రికెట్ జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

సెంచూరియన్ టీ20లో బాబర్ స‌రికొత్త చ‌రిత్ర 

పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ప్రొటీస్‌తో జరిగిన మొదటి టీ20లో 4 బంతుల్లో డకౌట్ కావడంతో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే, సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన రెండవ టీ20లోక్లాస్ టచ్‌లో కనిపించాడు. బాబర్ ఆజం 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 పరుగులతో తన ఇన్నింగ్స్‌ను ముగించాడు.

Tap to resize

ఈ ఇన్నింగ్స్ తో బాబర్ ఆజం అంతర్జాతీయ క్రికెట్‌లో 11000 టీ20 పరుగులు, మొత్తంగా 14000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో బాబార్ ఆజం పెద్ద స్కోర్ చేయ‌లేక‌పోయాడు కానీ, కొన్ని సంచలనాత్మక మైలురాళ్లను అందుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బాబర్ ఆజం ఈ మైలురాయిని సాధించిన 11వ ఆటగాడిగా నిలిచాడు. షోయబ్ మాలిక్ (127.47) తర్వాత రెండవ అత్యల్ప స్ట్రైక్ రేట్ (129.37) కలిగి ఉండగా, 11000 లేదా అంతకంటే ఎక్కువ టీ20 పరుగులతో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడు కీరన్ పొలార్డ్ (150.51) టాప్ లో ఉన్నాడు.

బాబర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 14000 పరుగులు పూర్తి చేశాడు. లెజెండరీ ప్లేయ‌ర్ మహ్మద్ యూసుఫ్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త సాధించిన రెండో పాకిస్థాని ప్లేయర్ గా నిలిచాడు. 

అన్ని ఫార్మాట్లలో పాకిస్థాన్ తరపున అత్యంత వేగంగా 14,000 పరుగులు:

337 ఇన్నింగ్స్‌లు - మహ్మద్ యూసుఫ్

338 ఇన్నింగ్స్‌లు - బాబర్ ఆజం

343 ఇన్నింగ్స్‌లు - జావేద్ మియాందాద్

378 ఇన్నింగ్స్‌లు - ఇంజమామ్-ఉల్-హక్

402 ఇన్నింగ్స్‌లు - యూనిస్ ఖాన్

విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. అతి తక్కువ  ఇన్నింగ్స్ లలో టీ20ల్లో 11 వేల పరుగులు పూర్తి చేసిన లిస్టులో బాబర్ ఆజం టాప్ లో ఉన్నాడు. అతను 298 ఇన్నింగ్స్ లలో ఈ పరుగుల మార్కును అందుకున్నాడు. విరాట్ కోహ్లీ దీని కోసం 337 ఇన్నింగ్స్ లను, క్రిస్ గేల్ 314 ఇన్నింగ్స్ లను తీసుకున్నాడు.  

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల‌లో టీ20ల్లో 11000 పరుగులు చేసిన ప్లేయ‌ర్లు

298 - బాబర్ ఆజం

314 - క్రిస్ గేల్

330 - డేవిడ్ వార్నర్

337 - విరాట్ కోహ్లీ

363 - ఆరోన్ ఫించ్

376 - జోస్ బట్లర్

386 - జేమ్స్ విన్స్

390 - అలెక్స్ హేల్స్

408 - రోహిత్ శర్మ

14000 అంతర్జాతీయ పరుగులను చేరుకున్న అతి తక్కువ ఇన్నింగ్స్‌లు:

309 - వివ్ రిచర్డ్స్

309 - హషీమ్ ఆమ్లా

313 - విరాట్ కోహ్లీ

319 - మాథ్యూ హేడెన్

327 - జో రూట్

328 - స్టీవెన్ స్మిత్

331 - బ్రియాన్ లారా

332 - కేన్ విలియమ్సన్

337 - మహ్మద్ యూసుఫ్

338 - బాబర్ ఆజం*

Latest Videos

click me!