కీర్తిసురేష్‌ తల్లితో చిరంజీవి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? విలన్‌గా చేసినా సూపర్‌ హిట్‌

First Published | Dec 14, 2024, 8:42 PM IST

కీర్తిసురేష్‌ ఇటీవలే పెళ్లిలైఫ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆమె తల్లి హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. ఆమె చిరంజీవితోనూ మూవీ చేసింది. అదేంటి? దాని ఫలితం ఏంటో చూద్దాం. 
 

మెగాస్టార్‌ చిరంజీవి తన ఐదు దశాబ్దాల కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు. ఎంతో మందిని పరిచయం చేశారు. అయితే ఓ హీరోయిన్‌తో చిరు రొమాన్స్ చేస్తే, ఆమె కూతురుకి బ్రదర్‌గానూ నటించాడు. తల్లితో హిట్‌ కొట్టాడు, కానీ కూతురితో మాత్రం సక్సెస్‌ అందుకోలేకపోయాడు. మరి ఆమె ఎవరు? ఆ సినిమా ఏంటి? ఆ స్టోరీ ఏంటనేది చూస్తే. 
 

కీర్తి సురేష్‌ ఇటీవల మ్యారేజ్‌ చేసుకుంది. తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్‌ని మ్యారేజ్‌ చేసుకుంది. పెద్దల సమక్షంలోనే వీరి పెళ్లి గోవాలో జరగడం విశేషం. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. కీర్తిసురేష్‌ తల్లి మేనక. ఆమె కూడా హీరోయిన్‌. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసింది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఆమె తెలుగులోనూ సినిమాలు చేయడం విశేషం. 
 

Tap to resize

కీర్తిసురేష్‌ అమ్మ మేనకతో చిరంజీవి సినిమా చేయడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో `పున్నమి నాగు`వచ్చింది. 1980లో విడుదలైన ఈ చిత్రానికి రాజశేఖర్‌ దర్శకుడు. ఇందులో చిరంజీవి నెగటివ్‌ రోల్‌ చేశారు. హీరోయిన్లుగా మేనకు సురేష్‌, రతి అగ్నిహోత్రి, జయమాలిని, మాధవి నటించారు. చిరంజీవిని ఇష్టపడే అమ్మాయిగా మేనక కనిపిస్తుంది. ఆమె పాత్ర ఆద్యంతం మెప్పిస్తుంది. ఇందులో నెగటివ్‌ రోల్‌లో విశ్వరూపం చూపించాడు చిరంజీవి. 
 

మేనక సురేష్‌ ఈ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `పున్నమి నాగు` సినిమా మంచి విజయం సాధించింది. కాకపోతే చిరంజీవి హీరో కాకపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ పడింది. ఈసినిమా తర్వాత మేనక మరో రెండు సినిమాలు చేసింది. దవళ సత్యం రూపొందించిన `సుబ్బరావుకి కోపం వచ్చింది` అనే సినిమాలో చేసినా సక్సెస్‌ కాలేదు.

అలాగే హీరో రాజశేఖర్‌తోనూ సినిమా చేసింది. `ఇంద్రధనస్సు`లో కీలకపాత్రలో నటించింది. ఇది కూడా యావరేజ్‌గానే ఆడింది. దీంతో మేనక తెలుగు సినిమాలకు దూరమైంది. 1987లో నిర్మాత సురేష్‌ కుమార్‌ని పెళ్లి చేసుకుంది. ఆతర్వాత సినిమాలకు దూరమైంది. 
 

ఇక చిరంజీవి.. కీర్తిసురేష్‌తోనూ సినిమా చేశారు. గతేడాది వచ్చిన `భోళా శంకర్‌`లో అన్నగా కనిపించారు చిరు. సొంత అన్న కాదు, అన్నాచెల్లిగా మెరిశారు. కానీ ఈ సినిమా ఆడలేదు. ఇక కీర్తిసురేష్‌కి తెలుగులో పెద్దగా సక్సెస్‌ లేదు. దీంతో ఆఫర్లు కూడా లేవు. ఇప్పుడు తమిళం, హిందీలో సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం. మ్యారేజ్‌ తర్వాత సినిమాలు మానేస్తుందా? కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. 
 

చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీగా రూపొందుతుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు చిరు. 

read more: శోభన్‌బాబుపై అందరి ముందే అరిచిన నిర్మాత.. సెట్‌లో హీరోయిన్‌తో ఆయన చేసిన పనికి సోగ్గాడు షాక్‌

also read: సినిమాల్లోకి వేణు మాధవ్‌ కొడుకు, ఏం చేయబోతున్నాడు? స్టార్‌ కమెడియన్‌ ఫ్యామిలీ ఇప్పుడు ఏం చేస్తుంది?
 

Latest Videos

click me!