Oct 1, 2019, 3:35 PM IST
దసరా నవరాత్రులు హిందువులకు అతిముఖ్యమైన పెద్ద పండుగ. తొమ్మిది రోజులపాటు అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తుల పూజలందుకుంటుంది. నవరాత్రి తొమ్మిదిరోజులూ చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇంకా కొంతమంది ముఖ్యంగా తమ భోజనంలో ఉల్లి, వెల్లుల్లిని దూరంగా పెడతారు. ఈ నవరాత్రుల ఉపవాసవ్రతంలో ఉపయోగపడే ఐదు ప్రత్యేకమైన వంటలు మీకోసం.
సాబుదానా కిచిడి : ఎక్కువమొత్తంలో పిండిపదార్థాలు, స్టార్చ్ తో నిండి ఉండే పదార్థం సాబుదానా. ఉపవాసక్రమంలో మీకు కావాల్సిన మరింత శక్తిని ఇచ్చే పదార్థం సాబుదానా. సాబుదానాతో పల్లీలు, కొంచెం మసాలాలు కలిసి లైట్ టిఫిన్ చేసుకోవచ్చు. సాబుదానా ఖీర్, సాబుదానా వడలు కూడా నవరాత్రుల్లో ఉపహారంగా బాగా పనిచేస్తాయి.
ఆలూ కీ కడి : నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ కొత్తరకపు ఆలూ రుచితో మీ జిహ్వకు కొత్త అనుభవాన్ని ఇవ్వండి. ఆలూతో చేసుకునే బోరింగ్ ఉపహారాలకు దూరంగా ఆరోగ్యకరమైన ఈ కడీతో మీ నవరాత్రిని మరింత ప్రత్యేకం చేసుకోండి.
మాఖనా ఖీర్ : తీపిపదార్థాలు ఎప్పుడూ నోటికి రుచిగానే ఉంటాయి. మాఖనా, పల్లీలతో తక్కువ కొవ్వు పదార్థాలు గల ఖీర్ చేసుకోవచ్చు. దీంతో తీపితింటే బరువు పెరుగుతామన్న ఆలోచనకూ దూరంగా ఉండచ్చు. రుచికరమైన ఈ ఖీర్ రెసిమీ మీ ఉపవాసాన్ని మరింత ఫలవంతం చేస్తుంది.
ఆరటిపండు, ఆక్రోట్ లస్సీ : అరటిపండ్లు, మంచి పెరుగు, తేనె, ఆక్రోట్ పలుకులతో తయారయ్యే ఈ పానీయం మీకు ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తుంది. ఉపవాసంలో ఈ పానీయంవల్ల రోజంతా అలుపులేకుండా ఉత్సాహంగా మీ పనులు చేసుకోవచ్చు.
కుట్టూ పూరీ : రెగ్యులర్ పూరీలకు కాస్త భిన్నమైంది ఆరోగ్యవంతమైంది, అధిక శక్తిని ఇచ్చేది కుట్టూ పూరీలు. మామూలు గోధుమపిండికి ఈ బక్ వీట్ పిండికి తేడా ఉంటుంది. నవరాత్రి ఉపవాసదినాల్లో చేసుకోదగిన మరో ప్రత్యేకమైన వంటకం ఇది. వండిన తరువాత 15-20 నిముషాల్లోపు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఛోళే, ఆలూ లాంటి ఏదైనా కూరతో తినొచ్చు. దీన్ని ఉపాహారంగానే కాకుండా మధ్యాహ్న భోజనంగా కూడా తీసుకోవచ్చు.