రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ భార్య లత.

Published : May 05, 2025, 10:36 AM IST

సూపర్ స్టార్  రజినీకాంత్ సినిమాలకు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన భార్య లత రజినీకాంత్ స్పందించారు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

PREV
14
రజినీకాంత్  సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ భార్య లత.
సూపర్ స్టార్ రిటైర్మెంట్ పై లత క్లారిటీ

ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజినీకాంత్ కు ప్రస్తుతం 74 ఏళ్ళు. ఈ వయసులో కూడా బిజీగా ఉన్న రజినీకాంత్, ప్రస్తుతం కూలీ, జైలర్ 2 సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

24
విడుదలకు సిద్ధమవుతున్న కూలీ

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, నాగార్జున, శృతిహాసన్, అమీర్ ఖాన్ వంటి పెద్ద తారాగణం నటిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. క్రిష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

34
జైలర్ 2 షూటింగ్ లో బిజీగా రజినీ

రజినీకాంత్ నటిస్తున్న మరో  సినిమా  జైలర్ 2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ తో పాటు రమ్యకృష్ణ, మీర్నా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ మూవీలో నటసింహం  బాలకృష్ణ కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ  సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

44
రజినీ రిటైర్మెంట్ పై లత స్పందన

74 ఏళ్ళ వయసులో కూడా సినిమాల్లో బిజీగా ఉన్న రజినీకాంత్, జైలర్ 2 తర్వాత సినిమాలకు రిటైర్మెంట్  పలకనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రజినీకాంత్ భార్య లత ఖండించారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నాకు తెలిస్తే చెప్తాను, ఇంకా ఆయన ఆ  ఆలోచించనలో లేరు అని అన్నారు. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకోవాలి అని అనిపిస్తే.. స్వయంగా రజినీకాంత్ ఆ విషయాన్ని వెల్లడిస్తారని లత అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories